సత్తెనపల్లి మండలం,గుడిపూడి రైల్వే ట్రాక్పై యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. సోమవారం ఉదయం స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుడు గుడిపూడికి చెందిన సన్నీ (22)గా గుర్తించారు. మృతుడి తల్లి అనారోగ్యానికి గురవ్వగా పరామర్శించడానికి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.