కర్నూలు, నంద్యాలలో కురిసిన వర్షాలకు ఉల్లి పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొంత పంటను రైతులు తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్కు తీసుకొచ్చారు. దీనికి కనీస ధర లభించకపోవడంతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు వ్యాపారులతో కొనుగోలు చేయించారు. తడిచిన ఉల్లిపాయలకు నిల్వ సామర్థ్యం లేకపోవడంతో కొనుగోలు చేసిన ఉల్లిని వ్యాపారులు బుధవారం సాయంకాలం నాలుగు గంటలకు తాడేపల్లిగూడెంలో పలు రహదారులపై పారబోశారు. దీనిని గమనించిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడి ఉల్లిని సేకరించుకోవడం విశేషంగా మారింది.