అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో కఠినమైన పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ పిలుపునిచ్చారు. నేడు శనివారం నగరంలో జరిగిన యూనియన్ జిల్లా స్థాయి వర్క్‌షాప్‌కు జిల్లా అధ్యక్షురాలు బి.రేణుక అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావమ్మ మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో 42 రోజులపాటు సమ్మె చేసినా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై కనీస హామీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీల సమ