తిరువూరు పట్టణంలోని ఖాళీ స్థలాలను సంబంధిత యజమానులు మెరక చేసుకుని ఫెన్సింగ్ వేసుకోవాలని 9వ వార్డు కౌన్సిలర్ మూడు దుర్గారావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఖాళీ స్థలాలలో నీరు నిల్వ ఉండి ప్రాణాంతకమైన రోగాలు రావడంతో పాటు సర్పాలు కూడా చేరుతున్నాయని ఈ కారణంగా నివాసితులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు.