22.08.2025 నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు రూరల్ మండలం, మేరీ ప్రియ నగర్ కు చెందిన 43 సంవత్సరాల మున్నంగి ప్రదీప్ కనిపించడం లేదని అతని తల్లి మున్నంగి రెజీనా స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. నల్లపాడు ఎస్సై రామకృష్ణ, సౌత్ డిఎస్పి భానోదయ మిస్సింగ్ కేస్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేయడం జరిగిందన్నారు.