ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు యూరియా బస్తాల కోసం నేడు ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుండి క్యూలైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సకాలంలో రైతులకు యూరియా అందక చేతికి అందిన పంట నాశనం అవుతుందని రైతులు వాపోతున్నారు.