జిల్లాలో ఇటీవలి భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించినందున ఆయా ప్రాంతాలలో సంభవించిన వరద నష్టానికి సంబంధించి నియోజకవర్గాల వారిగా నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో వరద నష్ట నివేదికలకు సంబంధించిన వివరాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల్లో వరదల కారణంగా సంభవించిన పంట నష్టం, ఫస్ట్ నష్టానికి సంబంధించి స్పష్టమైన నివేదికలను సమర్పించాలని అన్నారు. ఇప్పటికే వరద రాష్ట్ర అంచనాలను సిద్ధం చేసినట్లయితే, ఎస్టీవో తో అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.