ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు..భూమి కోసం విముక్తి కోసం దోపడికి వ్యతిరేకంగా తిరగబడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్ధం ఇంద్రవెల్లిలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి గిరిజనుల చిరకాల స్వప్నమని, ఎట్టకేలకు ఆ కల నెరవేరిందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, . అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేశారని గుర్తు చేశారు. కోటి రూపాయలతో స్మృతి వనాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.