శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అధికారులు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోకి ప్రజలు, చేపలు పట్టేవారు, పశువులు, గొర్రెల కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.