Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 31, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఆదివారం రాత్రి 11 గంటల వరకు వినాయక స్వామి నిమజ్జనాలు కనుల పండువగా నిర్వహించారు. బొజ్జ గణపయ్యలను ఊరేగింపుగా తీసుకెళ్తుండగా భక్తులు కాయ కర్పూరం సమర్పించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్నా పెద్ద తేడా లేకుండా పలు గ్రామాల్లో మహిళలు సైతం సాంస్కృతిక నృత్యాలు చేశారు. అనంతరం స్వామివారిని నిమజ్జనం చేసే ప్రదేశానికి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.