నిర్మల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. గంట పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినాయకుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చిన వివిధ గ్రామాల ప్రజలు వర్షంలో తడిసిపోయారు. బొజ్జ గణపయ్యలను పాలిథిన్ కవర్లతో చుట్టి జాగ్రత్తగా మండపాలకు తీసుకెళ్లారు.