Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: అందరూ వైఎస్సార్ అడుగుజాడల్లో నడవాలి: తాడిపత్రిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి

India | Sep 2, 2025
అందరూ దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ అడుగుజాడల్లో నడవాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు ఫయాజ్ భాష పిలుపునిచ్చారు. తాడిపత్రిలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమర్రహే అమర్ రహే వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి మరణించి 16 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us