శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన గురుపూజోత్సవంలో ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో టీచర్లు అవమానాన్ని ఎదుర్కొన్నారు. కుర్చీలు, తాగునీరు లేకపోవడంతో చేసేదేమీ లేక చెట్ల కింద నిలబడి కార్యక్రమాన్ని వీక్షించాల్సి వచ్చింది. గురువులకు తగిన గౌరవం లభించకపోవడంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.