ఆశా కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని ఆశ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఏటూరునాగారంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.26 వేల వేతనం వెంటనే చెల్లించాలని, ప్రమాద భీమా, పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు దావుద్ తదితరులు పాల్గొన్నారు.