లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శనివారం బెయిల్ మంజూరు కావడంతో సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయటకు రావడంతో జైలు వద్ద పలువురు నాయకులు కలిసి సంఘీభావం ప్రకటించారు అనంతరం రాజమండ్రి విమానాశ్రయానికి మిధున్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.