ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు అత్యంత శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజలకు సూచించారు. గణేష్ నిమజ్జన ప్రదేశాల్లో భద్రతా దృష్ట్యా ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రాగంణంలో ఏర్పాటు చేసిన పోలీసు గణనాథుడు, 5 రోజులు పూజలందుకున్న అనంతరం ఆదివారం ఉదయం జిల్లా ఎస్పీ స్వయంగా కొబ్బరికాయ కొట్టి నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, చిన్నారులు పెద్దఎత్తున పాల్గొని, జై భోలో గణేష్ మహరాజ్ అంటూ నినాదాలు చేశారు