ఆదోని మండలం 104 బసాపురం గ్రామ వంక పొంగి రాకపోకలు బంద్. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కసారి గ్రామాన్ని సందర్శించి మోరీ పైకి చేయాలని అన్నారు. వర్షం వస్తే మా గ్రామానికి రాకపోకలు బంద్ అవుతుందన్నారు. గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు చెప్పినా పరిష్కరించడం లేదన్నారు.