ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు ఎరువులు పురుగుల మందుల దుకాణాలను ఎమ్మార్వో అశోక్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి జవహర్ లాల్ నాయక్ పోలీసులతో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువులను ఎమ్మార్పీ ధరలకు మాత్రమే విక్రయించాలని, అక్రమంగా నిల్వ ఉంచి కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మితే దుకాణ యజమానులపై కేసు నమోదు చేసి లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించినట్లు తెలిపారు.