జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని ప్రతి పేదవాడికి 3సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డా.థామస్ హామీ ఇచ్చారు. జడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. జీడీనెల్లూరు మండలంలోని 40మంది అర్హులకు పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గంలో పదివేల మందికి ఇంటి పట్టాలు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.