జైలు నుంచి విడుదలైన అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కార్యకర్తలు నేతలు ఘన స్వాగతం పలికారు. నెల్లూరులోని అయన నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, జిల్లాలో ఒక్క స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో గెలవదని ఆయన జోస్యం చెప్పారు.