తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి శనివారం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేకి పలు సూచనలు చేశారు.