గూడెం కొత్తవీధి మండలం దారకొండ రైతు సేవ కేంద్రం వద్ద మంగళవారం యూరియా బస్తాలు పంపిణీ చేపట్టేందుకు వచ్చిన అధికారులు వాటిని రైతులకు ఇవ్వకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. దారకొండ, దుప్పిలవాడ,గుమ్మిరేవులు పంచాయతీలకు చెందిన సుమారు 600 మంది రైతులు యూరియా బస్తాలు ఇస్తున్నారని తెలిసి మంగళవారం ఉదయానికే చేరుకున్నారు. అయితే పంపిణీకు 177 బస్తాలు మాత్రమే రావడంతో ఇవి మాకు సరిపోవని, అధికారులు మాకు సరిపడా యూరియా బస్తాలు ఇవ్వాలని కోరారు. రెండో విడత వచ్చిన తరువాతే మా అందరికి ఇవ్వాలని రైతులు స్ప్రష్టం చేసి వెనుదిరిగారు.