మంత్రాలయం: మండల కేంద్రంలో మొదటి అంతరాష్ట్ర కన్నడ సాహిత్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ వచ్చారు. శుక్రవారం ముందుగా కన్నడ సాహిత్య సమావేశ నిర్వాహకులు పీఠాధిపతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి జ్యోతి ప్రజ్వలన చేసి కన్నడ సాహిత్య సమావేశాన్ని ప్రారంభించారు. కన్నడ భాష, కళ, సంస్కృతిని అభివృద్ధి చేయాలని నిర్వాహకులకు సూచించారు.