అనంతపురం నగర శివారులోని రాప్తాడు రామినేపల్లి గ్రామాల మధ్యలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం లారీని ఢీకొన్న ఘటనలో సికేపల్లి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వారిలో ఒక యువకుడి పరిస్థితి అత్యంత విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.