తడి పొడి చెత్త సేకరణ కోసం పారిశుద్ధ్య సిబ్బంది గ్రీన్ అంబాసిడర్లు వస్తున్నారా లేదా అనే విషయంపై తెలియజేయాలని కరప ఎంపీడీవో సలాది శ్రీనివాసరావు గ్రామస్తులను కోరారు. గ్రామంలో పర్యటించడాయన మహిళలకు చెత్త సేకరణ విధానాన్ని వివరించారు. పంచాయతీ పారిశుద్ధ్యన్ని పట్టించుకోకపోతే సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలన్నారు.