ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీ పరిధి సరంపేట లో బుధవారం సాయంత్రం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ, గొండోలు పంచాయతీ పరిధిలో వందల ఎకరాల భూములు నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయని వాటన్నిటిని ప్రభుత్వం స్వాధీన పరుచుకొని భూమి లేని నిరుపేద ఆదివాసులకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పూర్వం నుంచి నివసిస్తున్న ఆదివాసులకు చాలామందికి వ్యవసాయం చేసుకోవడానికి ఎకరం భూమి కూడా లేదని అన్నారు.