ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన రెండు వేరువేరు ఘటనలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, 108 సిబ్బందికి రిమ్స్ కు తరలించారు. అదేవిధంగా తాంసి మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి శనివారం గడ్డి మందు తాగి ఆత్మహత్య కు యత్నించాడు. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది బాధితున్ని రిమ్స్ కు తరలించారు.