మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆదాయం ఎంతంటే..! ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న స్తానిక మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల రూపంలో రూ.6,35,302 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో మిడియాకు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారని తెలిపారు. అలాగె భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు అయన తెలిపారు.