అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని దంచర్ల గ్రామానికి చెందిన లాలెప్ప అనే వృద్ధుడు చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.