ఆకులమాన్నాడులో పోలీసుల పర్యవేక్షణలో రైతులకు 25 టన్నుల యూరియా పంపిణీ స్తానిక పెడన నియోజకవర్గం ఆకులమన్నాడు గ్రామంలో సహకార సంఘం వద్ద శనివారం మధ్యాహం 4 గంటల సమయంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో రైతులకు యూరియా పంపిణీ జరిగింది. యూరియా స్టాక్ వచ్చిందని తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. అనంతరం రైతులకు టోకెన్ల ఆధారంగా 25 టన్నుల యూరియాను పంపిణీ చేశారు.