చిన్నారులను భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకమని తిరుపతి జిల్లా గూడూరు MLA పాశం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు జడ్పీ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన టీచర్స్ డే వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు