Repoter Narasannapeta (M) నరసన్నపేట: గ్యాస్ ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన గ్యాస్ ప్రమాదాలపై విద్యార్థులు ముఖ్యంగా బాలికలు తెలుసుకోవడం ఎంతైనా అవసరమని అగ్నిమాపక దళ అధికారి ఎస్ వరహాలు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అగ్నిమాపక కేంద్రంలో పలు పాఠశాలల విద్యార్థులకు గ్యాస్ సిలిండర్లు, వాటితో అనుకోకుండా చోటుచేసుకునే ప్రమాదాలు, నివారణ చర్యలపై ప్రయోగాత్మకంగా సిబ్బంది తెలియజేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.