మండపేట మండలం, వల్లూరు లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. వల్లూరు లో రూ.40 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్, సీసీరోడ్లు ప్రారంభించారు అనంతరం చెరువుగట్టుపై ఇళ్లను ఖాళీ చేసిన 15 మంది కుటుంబాలకు పట్టాలు అందజేశారు.