గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆశన్న డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పండుగల పూట వేతనాలు అందక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.