కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు 26,000 పెంచి గుర్తింపు కార్డులు ఇచ్చి ఈఎస్ఐ పిఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సిఐటియూ వికారాబాద్ జిల్లా యూనియన్ డిమాండ్ చేసింది. బుధవారం కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశం లో సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ కార్యాలయంలో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు.