గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలి ... జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్. వినాయక ఉత్సవాల్లో ఆఖరు ఘట్టమైన గణేష్ నిమజ్జనం జిల్లా కేంద్రంలో సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు పోలీసు అధికారులకు తెలిపారు.భద్రత ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. కెసి కెనాల్ , వినాయక్ ఘాట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.గణేష్ నిమజ్జనం సంధర్బంగా వినాయక విగ్రహాలు బయలుదేరే మొదటి రాంబోట్ల దేవాలయం, బాదం మాస్క్ , కింగ్ మార్కెట్ , కొండారెడ్డి బురుజు , అంబేద్కర్ సర్కిల్, రాజ్ విహార్ మీదుగా వెళ్లే వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను పరిశీలించ