కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం వేపరాల గ్రామంలో గురువారం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి పర్యటించారు.ఈ సందర్బంగా ఆయన వేపరాల గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతుల సందర్భంగా చౌడమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి జ్యోతులను ఎత్తుకున్నారు. అనంతరం గ్రామ నాయకులు, ప్రజలతో పలు విషయాలపై మాట్లాడి గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.