జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేదని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మద్దిలేటి పేర్కొన్నారు. ఆదివారం బనగానపల్లె నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి, జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆర్ఎస్కే కార్యాలయాల్లో ఉన్న ఎరువులను పరిశీలించారు. ఏడీఏ సుధాకర్, ఏవో సుబ్బారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.