సత్తెనపల్లి మార్కెట్ యార్డ్లో యూరియా కోసం రైతులు రాత్రంతా పడిగాపులు కాస్తున్నారు. ఎరువులు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులోని స్టాక్ పాయింట్ షట్టర్ను మూసివేశారని రైతులు ఆందోళన చెందారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు యూరియా అందేలా చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.