కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన మద్దిరాల చెన్నప్ప (53) అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి కనబడకుండా వెళ్లిన చెన్నప్ప ఆదివారం ఉదయం తన పొలంలో శవమై కనబడ్డాడు. 3 సంవత్సరాలుగా పొలం సాగు చేస్తున్న సరైన దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలైనట్లు బంధువులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారన్నారు.ఈ ఘటనపై తలమంచి పట్నం ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.