లైంగిక వేధింపులకు గురైనప్పుడు మౌనం వహించాల్సిన అవసరం లేదని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ మరియు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, లైంగిక వేధింపుల నివారణ చట్టాలపై సోమవారం సమావేశం నిర్వహించారు. పట్టణంలోని సంఘమిత్ర కాలేజీలో జరిగిన కార్యక్రమంలో జడ్జి గారు అతిధిగా పాల్గొని ప్రసంగించారు. పురుషులతో సమానంగా మహిళలకు కూడా చట్టాలు ఉన్నాయని తెలిపారు. ఎవరికైనా ఆపద సంభవిస్తే జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి మల్లీశ్వరి, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్