తరిగొప్పుల మండలంలోని కేజీవీబీ, జడ్పీ హైస్కూల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం సందర్శించారు.మధ్యాహ్న భోజన తయారీకి వాడుతున్న వంట సరుకులను, పప్ప్పు ధాన్యాలను, కూరగాయలను పరిశీలించి,వంట కి వాడే ప్రతీ వస్తువు తాజా గా ఉండాలన్నారు.ఉపాధ్యాయుల హాజరు ను పరిశీలించి పదవ తరగతి విద్యార్థుల తో మాట్లాడి. చదువు ఎలా సాగుతుంది అని, ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నారు, కష్టం గా ఉన్న సబ్జెక్ట్ లు చదువుతున్నార.. లేదా.... అని అడిగి... పదవ తరగతి పరీక్ష లు చాలా ముఖ్యమని... మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.