ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ పిలుపునిచ్చారు. కళ్యాణ దుర్గం లోని నగరవనంలో మంగళవారం జనసేన పార్టీ నాయకులు, ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ప్లాంటేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వంద మొక్కలు నాటారు. బాల్యం రాజేష్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం, పచ్చదనం కోసం మొక్కల నాటాలన్నారు. చెట్లు ప్రగతికి చిహ్నాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం రెండు మొక్కలైనా నాటాలన్నారు.