నల్లగొండ జిల్లా: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అగౌరవపరచి మాట్లాడితే బీఆర్ఎస్ బిజెపి నాయకులు నల్లగొండలో రోడ్లమీద తిరగలేరని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా గుమ్మల మోహన్ రెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే మంత్రితో పాటు కాంగ్రెస్ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారి రాజకీయాలను నల్లగొండ ప్రజలు గమనిస్తున్నారని గన్మెన్ల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.