సెప్టెంబర్ 7వ తేదీ జిల్లాలోని 15 కాలేజీలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిఆర్ఓ విజయ్ కుమార్ తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి బీట్ ఆఫీసర్లు మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆదేశించారు. అభ్యర్థులకు తాగునీటి వసతిని అందుబాటులో ఉంచాలన్నారు.