ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దుపాడు గ్రామంలో ఇటీవల జమీయా మసీదుకు దుండగులు నిప్పు పెట్టిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శుక్రవారం పరిశీలించి మత పెద్దలతో విషయాలను అడిగి తెలుసుకున్నారు. మసీదు మరమ్మతుల నిమిత్తం రెండు లక్షలు వారికి అందజేశారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.