బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ కృష్ణ అన్నారు. గురువారం బాపట్లలోని ఏవీవీ హైస్కూల్ విద్యార్థులకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణ, లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు ఏదైనా అత్యవసర సహాయానికి 1098 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సత్యవతి ఉన్నారు.