స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం, ఈ పథకం వలన ఆటో రిక్షా కార్మికులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సి ఐ టీ యు అనుబంధ విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం.కోరింది ఇప్పటికే అరకొర ఆధాయాలతో ఇబ్బందులు పడుతు జీవిస్తున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలు,ఈ ఉచిత బస్సు పథకం అమలు తర్వాత పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారనీ సి ఐ టీ యు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కొమ్మాధి జంక్షన్ నుండి రైతు బజారు,మధురవాడ వంతెన క్రింది నుండి జీ వి ఎం సి జోనల్ 2 కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.