రాజోలు మండలం శివకోడులోని స్థానిక చిన్నోడు వైన్ షాపు ఎదురుగా ఇద్దరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. సోమవారం రాత్రి ఇద్దరు యువకులు మధ్య జరిగిన గొడవ పెద్ద గొడవకు దారితీసింది. పొదలాడకు చెందిన యువకులు కలిసి మద్యం సేవింస్తుండగా ఇద్దరు యువకులు మధ్య గొడవ జరిగింది. పోదలాడ గ్రామానికి చెందిన గుత్తులసాయి, చిట్టిబొమ్మ శ్రీను ఇద్దరు కలిసి నల్లి రఘు అనే యువకుడిపై బీరు బాటిల్ తో దాడి చేశారు.