నిర్మల్ జిల్లా కేంద్రంలోని బేస్తవారిపేట్ కాలనీకి చెందిన ఐశ్వర్య అనే బాలిక అనారోగ్యంతో బాధపడుతూ నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2.50 లక్షల ఎల్ఓసీ చెక్కును బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు బుధవారం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు శ్రీహరి రావుకు కృతజ్ఞతలు తెలిపారు.